Bandi Sanjay: బీఆర్ఎస్ అధికార దుర్వినియోగం తేటతెల్లం.. హైకోర్టు తీర్పుపై బండి రియాక్షన్

by Prasad Jukanti |   (  Updated:2025-11-20 12:19:39  IST  )

నిజం గెలిచింది.. న్యాయం నిలిచింది అని హైకోర్టులో తనకు ఊరట లభించడంపై బండి సంజయ్ స్పందించారు.

Bandi Sanjay: బీఆర్ఎస్ అధికార దుర్వినియోగం తేటతెల్లం..  హైకోర్టు తీర్పుపై బండి రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2023 లో పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ (Class 10 Question Paper Leakage) కేసులో కమలాపురం పీఎస్‍లో తనపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు (High Court) కొట్టివేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఎక్స్ వేదిగా రియాక్ట్ అయిన ఆయన సత్యమేవ జయతే అంటూ పోస్టు ప్రారంభించారు. 'నాడు అధికారంలో ఉన్న ఉన్న BRS ప్రభుత్వం నాపై పెట్టించిన కట్టుకథ 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసును హైకోర్టు రద్దు చేసింది. BJPని సైలెన్స్ చేయడానికి చేసిన అధికార దుర్వినియోగానికి ఇదో ఉదాహరణ. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని వాళ్లకే తెలిసినా ప్రతీకార రాజకీయాల కోసం పోలీసులను ఆయుధాల్లా ఉపయోగించారు. BRS నాయకత్వం ఎంత దిగజారిందో దీంతో స్పష్టమైంది. మానవత్వం, మర్యాద లేకుండా నా అత్త దశదిన కర్మ రోజే నన్ను ఈడ్చుకెళ్లారు. ఇది పూర్తిగా రాజకీయ పగ. ఈరోజు కోర్టు తీర్పుతో బీఆర్ఎస్ అబద్ధాలు, దుర్వినియోగం, అధికార దౌర్జన్యం అంతమైంది. నిజం గెలిచి. న్యాయం నిలిచింది' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాడు తనను అరెస్టు చేసినప్పటి విజువల్స్ ను బండి సంజయ్ షేర్ చేశారు. ట్వీట్

Next Story