బండి సంజయ్‌కు రాజకీయ సన్యాసం తప్పదు.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-26 08:58:08  IST  )

కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) రాజకీయ సన్యాసం చేయడం తప్పదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Nayini Rajender Reddy) అన్నారు.

బండి సంజయ్‌కు రాజకీయ సన్యాసం తప్పదు.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) రాజకీయ సన్యాసం చేయడం తప్పదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Nayini Rajender Reddy) అన్నారు. తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆరు గ్యారంటీలపై ప్రజలు కాంగ్రెస్ నేతలను జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందంటూ బండి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడతూ.. దేశంలో బీజేపీ చేసిన ఓట్ చోరీని బయట పెట్టేందుకే రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్రను’ చేపట్టారని కామెంట్ చేశారు. 20 నెలల కాలంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి న్యాయకత్వంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. బండి సంజయ్‌కి రాజకీయ సన్యాసం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాల అమలుతో కాంగ్రెస్ ప్రజా పాలన కొనసాగుతోందని అన్నారు. తెలంగాణకు ఎవరు ఏం చేశారో.. దమ్ముంటే చర్చకు రావాలని బండి సంజయ్‌కి నాయిని రాజేందర్‌ రెడ్డి సవాల్ విసిరారు.

Next Story