కేంద్ర హోంశాఖ అధికారులతో బండి సంజయ్ భేటీ.. ఇంత సడన్‌గా ఎందుకంటే?

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-07 11:19:11  IST  )

కేంద్ర హోంశాఖ అధికారులతో బండి సంజయ్(Bandi Sanjay) భేటీ అయ్యారు.

కేంద్ర హోంశాఖ అధికారులతో బండి సంజయ్ భేటీ.. ఇంత సడన్‌గా ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ అధికారులతో బండి సంజయ్(Bandi Sanjay) భేటీ అయ్యారు. రేపు ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో విచారణకు హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలకంగా చర్చిస్తున్నట్లు సమాచారు. కాగా, ఈ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని బండి సంజయ్‌ను సిట్ కోరిన విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని పలుమార్లు బండి సంజయ్ ఆరోపించారు. అంతేకాదు.. దీనిపై అప్పట్లో ఆయన పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్ ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. ఇందులో భాగంగా గతంలోనే బండి సంజయ్‎కు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది.

Next Story