Phone tapping case: రేపు విచారణకు హాజరుకాలేను.. సిట్ కు బండి సంజయ్ లేఖ

by Prasad Jukanti |

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ అధికారులకు లేఖ రాశారు.

Phone tapping case: రేపు విచారణకు హాజరుకాలేను.. సిట్ కు బండి సంజయ్ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone tapping case) కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సిట్ కు లేఖ రాశారు. రేపటి విచారణకు హాజరు కాలేనని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఈనెల 28న హాజరవుతానని సిట్ కు లేఖ ద్వారా తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ కు గురైందని సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో వాంగ్మూలం నమోదు చేసేందుకు సమయం ఇవ్వాలని సిట్ అధికారులు బండి సంజయ్ కి నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ నెల 24న విచారణకు కేంద్ర మంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో బండి సంజయ్‌ స్టేట్ మెంట్ నమోదుకు సిట్‌ అధికారులు రెడీ అయ్యారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగుతున్నందున రేపటి విచారణకు రాలేనని సిట్ కు బండి తెలిపారు. ఈ నెల 28న వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. అదే రోజున సంజయ్ తోపాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది విచారణకు హాజరుకానున్నారు.

బండి చేతిలో కీలక ఆధారాలు:

కేసీఆర్ సర్కార్ తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని గతంలోనే బండి సంజయ్ ఆరోపించారు. అయితే ఈ తాజాగా ఆయన కేంద్ర నిఘా వర్గాల ద్వారా కీలక సమాచారం, ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. సిట్ ఎదుట హాజరైన సందర్భంలో ఈ ఎవిడెన్స్ ను దర్యాప్తు అధికారులకు అందజేయబోతున్నట్లు సమాచారం. మరో వైపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్ చేయడం, భార్యభర్తల బెడ్రూం మాటలను ట్యాప్ చేయడాన్ని తీవ్రంగాగా పరిగణిస్తున్న బీజేపీ అధిష్టానం ఈ కేసులు సీబీఐకి అప్పగించాలని కోరుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ కేసు వేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ పాత్రపై ఐబీ వర్గాలు ఆధారాలు సేకరిస్తున్నాయని ఇప్పటికే పెద్దాయన(కేసీఆర్) చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ ఎదుట అంగీకరించిన రాధాకిషన్ రావు అంగీకరించారనే టాక్ వినిపిస్తోంది. నాటి డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు వెల్లడించారని దీంతో ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్ ల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో 28వ తేదీన బండి సంజయ్ దర్యాప్తు అధికారులకు ఏం చెప్పబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.

Next Story