- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంగాధర ఘటనపై బండి సంజయ్ సీరియస్
by Muthe.Rajitha |
కరీంనగర్ జిల్లా గంగాధరలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు.

X
దిశ, వెబ్ డెస్క్ : కరీంనగర్ జిల్లా గంగాధరలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. స్కూల్లో బాలికల బాత్రూమ్ లో సీక్రెట్ కెమరాలు పెట్టి, బాలికల ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించినట్లు అటెండర్ యాకుబ్‌పై ఫిర్యాదులు రావడం సంచలనం సృష్టించింది. వీడియోలు చూపించి పిల్లల్ని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వెల్లువెత్తగా.. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.
కరీంనగర్ గ్రామీణ ఏసీపీతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని, నిందితుడి వద్దనున్న వీడియోలను స్వాధీనం చేసుకోవాలని బండి సంజయ్ పోలీసులను ఆదేశించారు. కాగా నిందితుడు యాకుబ్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






