ఈ ఆనందం పట్టలేకపోతున్నా: బండి సంజయ్

by Gantepaka Srikanth |

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుందని అన్నారు.

ఈ ఆనందం పట్టలేకపోతున్నా: బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల(Telangana Municipal Elections) ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుందని అన్నారు. ఈ అద్భుత అవకాశాన్ని ఇచ్చిన ఓటర్లకు బండి సంజయ్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఆనందం పట్టలేకపోతున్నా అని హర్షం వ్యక్తం చేశారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దానిపైనే పోరాటం చేశాం.. విజయం సాధించామని అన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై విచ్చలవిడిగా డబ్బులు పంచాయి. కరీంనగర్‌కు సీఎం వచ్చారు. ఎంఐఎం బాస్ వచ్చారు. మహామహులు కరీంనగర్‌లో ప్రచారం చేశారు. అయినా కరీంనగర్‌ను టచ్ చేయలేకపోయారు. 66 డివిజన్లలో 31 గెలిచాం, మద్దతు ఇవ్వడానికి ముగ్గురు ఇండిపెండెంట్లు రెడీగా ఉన్నారు. అభివృద్ధి కోసం మీతో కలిసి వస్తామని మరో ముగ్గురు టచ్‌లోకి వచ్చారు. కరీంనగర్‌ను అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ తెలిపారు.

Next Story