- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకునూరి మురళి అర్బన్ నక్సలైట్ : విద్యా కమిషన్ నివేదికపై బండి సంజయ్ ఆగ్రహం
విద్యా రంగంలో కొత్త మార్పుల కోసం అవసరమైన సిఫార్సులు చేయకుండా ఉపాధ్యాయుల జీతాలు తగ్గించాలంటూ విద్యా కమిషన్ నివేదిక ఇవ్వడం సిగ్గు చేటుగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యా రంగంలో కొత్త మార్పుల కోసం అవసరమైన సిఫార్సులు చేయకుండా ఉపాధ్యాయుల జీతాలు తగ్గించాలంటూ విద్యా కమిషన్ నివేదిక ఇవ్వడం సిగ్గు చేటుగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తులకే నైతికత లేదని ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఏసీ గదుల్లో కూర్చుని రూపొందించిన నివేదికగా ఉందని ఆరోపించారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆ నివేదికను తీసుకెళ్లి మూసీలో వేయాలని, ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీసి అవమానించేలా చేసినట్లు ఉందని ఫైర్ అయ్యారు. ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 45కు పెంచాలని చేసిన సిఫార్సులను అమలు చేస్తే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా విద్యార్థులంతా ఇకపై స్కూల్ స్థాయిలోనే ఫెయిలై ఉన్నత విద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది.. స్కూళ్లు ఉన్న చోట టీచర్లు లేరు.. టీచర్లు ఉన్న చోట విద్యార్థులు లేరు.. అందరూ ఉన్న చోట కనీస సదుపాయాలు లేవని డ్రాపవుట్స్ సంఖ్య పెరుగుతోందని ఆరోపించారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుదామంటే ఫీజులు భరించలేని పరిస్థితి ఉందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వలేని దుస్థితి కాంగ్రెస్ పాలనలో ఉందన్నారు. విద్యా వ్యవస్థను ఏ విధంగా మెరుగుపర్చాలనే సోయి లేకుండా విద్యా కమిషన్ పూర్తి భిన్నంగా నివేదిక ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
లొంగిపోయిన మావోయిస్టులను పిలిచి ప్రోత్సాహం..
ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతుందనే సాకుతో టీచర్ల జీతాల్లో కోత పెట్టాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యా రంగానికి ఏళ్ల తరబడి సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు సీనియారిటీ ఆధారంగా హెడ్మాస్టర్ గా ప్రమోషన్ ఇస్తుండగా కమిషన్ మాత్రం అందుకు భిన్నంగా నేరుగా హెడ్మాస్టర్ పోస్టుకు పరీక్షలు నిర్వహించాలని చెప్పడం దారుణంగా ఉందన్నారు. ఆకునూరి మురళికి అర్బన్ నక్సలైట్ భావజాలం ఉందని ఆయన ఆధ్వర్యంలో కమిషన్ వేయడాన్ని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ఆరోపించారు. అర్బన్ నక్సలైట్ ఆధ్వర్యంలోని కమిషన్ ద్వారా నివేదిక తెప్పించుకుని ప్రభుత్వం ఏం సాధించిందని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లొంగిపోయిన మావోయిస్టులను పిలిచి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు అర్బన్ నక్సలైట్ భావజాలమున్న వాళ్లను కమిటీలు, కమిషన్లలో వేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ రైతాంగానికి వెంటనే రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కార్యాచరణ చేపట్టబోతోందని, ఇప్పటివరకు రైతు భరోసా రెండు వాయిదాల పైసలు రైతులకు ప్రభుత్వం బాకీ ఉందని, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలయ్యాక రైతు భరోసా ఇవ్వకుండా పూర్తిగా ఎగ్గొట్టాలని కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. మోడీ ప్రభుత్వం 4 కోట్ల ఇండ్లను కట్టించి పేదలకు ఇండ్లు నిర్మించడంలో ముందుంటే కాంగ్రెస్ కూల్చివేతల్లో ముందుంది ఉంది.. కోకాపేటలో వక్ఫ్ బోర్డు భూములు, మైనింగ్ భూముల జోలికి వెళ్లరని ఆధ్యాత్మికమైన శారదా పీఠంలోని గుడులను కూల్చడమేమిటని ప్రశ్నించారు.






