- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండి సంజయ్‌కు హైకోర్టులో భారీ ఊరట
కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు బండి సంజయ్(Bandi Sanjay) కి హైకోర్టు(High Court)లో భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు బండి సంజయ్(Bandi Sanjay) కి హైకోర్టు(High Court)లో భారీ ఊరట లభించింది. బండి సంజయ్‌పై 2021 నవంబర్‌లో నమోదైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసును తెలంగాణ హైకోర్టు నేడు కొట్టివేసింది(Case Dismissal). 2021లో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలు రాగా, సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన అప్పటి తహసీల్దార్ శేషగిరిరావు నవంబర్ 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పెన్‌పహాడ్ పోలీసులు బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఆయన ఎన్నికల ప్రచార నిబంధనలను అతిక్రమించి, వడ్ల కొనుగోలు కేంద్రాల సందర్శన పేరుతో ఎన్నికల ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించగా.. ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినట్లు నిరూపించబడలేదని బండి తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, ఈ కేసును సరైన సాక్ష్యాధారాల నిరూపణ లేని కారణంగా కొట్టివేసింది. బీజేపీ నాయకులు ఈ తీర్పును స్వాగతిస్తూ, ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని ఆరోపించారు.






