- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay: మా సహనాన్ని పిరికితనంగా భావించొద్దు.. మహదేవప్ప మరణంపై బండి ఫైర్
బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతి పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహదేవప్పది బలవన్మరణం కాదని కాంగ్రెస్ చేసిన హత్య అని ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ను రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతోందన్నారు. మా సహనాన్ని పిరికితంగా భావిస్తారా అని ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పై బీజేపీ యుద్ధం చేయబోతోందని చెప్పారు. బీఆర్ఎస్ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీకార్యకర్తలదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్తాపితం చేసే రోజులు వచ్చాయన్నారు. మహదేవప్ప మరణానికి కారణమైన కాంగ్రెస్ నేతలను వెటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మృతిపై నిస్పాక్ష దర్యాప్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.






