- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాతబస్తీని ఒవైసీలకు రాసిచ్చారా?: CM రేవంత్‌పై బండి సంజయ్ నిప్పులు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం రాత్రి పాతబస్తీలో పర్యటించారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం రాత్రి పాతబస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓల్డ్ సిటీలో నివసిస్తున్న పశ్చిమ బెంగాల్ వాసులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బెంగాల్‌లో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపాలని ఆయన వారిని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపైనే కాకుండా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే హైదరాబాద్‌లో ఉంటున్న బెంగాలీలు కూడా బీజేపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం నేతలకు, ముఖ్యంగా ఒవైసీ సోదరులకు 'దాసోహం' అయ్యారని బండి సంజయ్ ఆరోపించారు. పాతబస్తీలో పోలీసులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. "పాతబస్తీని మొత్తం ఒవైసీ సోదరులకు రాసిచ్చారా?" అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్ర రాజధానిలో అంతర్భాగమైన ఓల్డ్ సిటీలోనే శాంతిభద్రతలను కాపాడలేని ముఖ్యమంత్రి, మారుమూల ఆదిలాబాద్ వంటి ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేస్తారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పాతబస్తీలో ఒక చట్టం, మిగతా నగరంలో ఒక చట్టం అమలు చేస్తున్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి వీడాలని, లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ పర్యటనలో స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






