- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: తక్షణమే టెన్త్ పరీక్షల టైమ్ టేబుల్ మార్చాలి
తెలంగాణలో పదో తరగతి ప్రీ ఫైనల్స్ పరీక్షల(10th Pre Final Exams) టైమింగ్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 6 నుండి నిర్వహించే పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుండి 3.15 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్మండిపడ్డారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఆ సమయంలో విద్యార్థులు, అధ్యాపకులు సహా ప్రతి ఒక్కరూ లంచ్ చేసే సమయమని, అప్పడు పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం 4 గంటల తరువాత విధుల నుండి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందన్నారు.
పాఠశాలల వేళలు సైతం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 గంటలకు ముగుస్తాయి. అయినప్పటికీ మళ్లీ రంజాన్ పేరుతో వేళాపాళా లేకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్గం వారిని మెప్పించేందుకు యావత్ విద్యార్థుల కడుపు మాడ్చడం మానుకోవాలని హెచ్చరించారు. తబ్లిగీ జమాతే వంటి విదేశాల్లో నిషేధిత సంస్థ మన రాష్ట్రంలో సభలు నిర్వహించుకుంటే ఏకంగా ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేస్తున్నారు. రంజాన్‌కు డ్యూటీ మినహాయింపు ఇస్తున్నారని, రంజాన్‌కు బహమతులు అందిస్తారని పేర్కొన్నారు.
మక్కా వెళ్లేందుకు ఉచిత వసతి, రవాణా సదుపాయాలు కల్పిస్తారు. కానీ అయ్యప్ప, భవానీ, హనుమాన్ భక్తులకు మాత్రం ఎలాంటి మినహాయింపులూ ఇవ్వడం లేదని మండిపడ్డారు. హిందూ పండుగలకు ప్రత్యేక నిధులూ కేటాయించకపోవడంతో పాటు నిబంధనల పేరుతో అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో ఇదేనా సమానత్వమంటే హిందువులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత చులకనా మారిందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలి. విద్యార్థులకు, అధ్యాపకులకు ఇబ్బంది లేకుండా 10వ తరగతి ప్రీఫైనల్ పరీక్షా టైం టేబుల్ ను మార్చాలని సూచించారు..






