Bandi Sanjay: ఢిల్లీ జనం చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారు.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళ్తోంది.

Bandi Sanjay: ఢిల్లీ జనం చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారు.. బండి సంజయ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళ్తోంది. పోస్టల్ బ్యాలెట్ నుంచి ఆ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 42 స్థానాల్లో బీజేపీ (BJP), 28 స్థానాల్లో ఆప్ (AAP) అభ్యర్థులు లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ట్రెండ్ ఇలానే కొనసాగితే ఢిల్లీ (Dehli)లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న 26 ఏళ్ల బీజేపీ (BJP) కల నెరవేరనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌ను ఆ పార్టీ గుర్తు చీపురుతో ఊడ్చేశారని కామెంట్ చేశారు. కుంభకోణాలు, నిత్యం జైలుకు వెళ్లే పార్టీ నేతలు తమకు వద్దని హస్తిన ప్రజలు డిసైడ్ చేసుకున్నారని సెటైర్లు వేశారు. ఢిల్లీలో ఈసారి కాషాయ జెండా ఎగురుతుందని తాము ముందే ఊహించామని అన్నారు. ప్రజాస్వామ్య పాలనను ఆ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

Next Story