Bandi Sanjay: మోడీ బియ్యం వద్దని లేఖ రాసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?: బండి సంజయ్

by Prasad Jukanti |   (  Updated:2025-04-13 07:02:24  IST  )

మోడీ బియ్యం వద్దని లేఖ రాసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

Bandi Sanjay: మోడీ బియ్యం వద్దని లేఖ రాసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?: బండి సంజయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. మోడీ (Narendra Modi) బియ్యం వద్దని లేఖ రాసే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ఉందా అని ప్రశ్నించారు. కిలోకు రూ.37 ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గొప్పనా లేక రూ.10 రేవంత్ రెడ్డి గొప్పనా అని ప్రశ్నించారు. ప్రతి పేదకు రూ.37లు ఖర్చు పెట్టి మోదీ ప్రభుత్వం రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తుంటే, కనీసం ప్రధాని ఫోటో కూడా పెట్టకపోవడం దారుణం. ఇన్నాళ్లు సన్న బియ్యం ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇవాళ కరీంనగర్ లోని జూబ్లీనగర్ లో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గావ్ చలో’ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. మోడీ పాలన మరువొద్దు.. బీజేపీని విడువొద్దు అన్నారు. దేశమంతటా నరేంద్ర మోడీ కోట్లాది ఇండ్లు నిర్మిస్తే తెలంగాణలో మాత్రం పేదలకు గూడు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసిందని కేసీఆర్ అప్పులన్నీ తెలిసి కూడా హామీలు ఇచ్చారని మండిపడ్డారు. బీజేపీకి ఓట్లు ముఖ్యం కాదని పేదల ప్రజల సంక్షేమమే ముఖ్యం అన్నారు. మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలతో కాలం వెల్లదీస్తోందని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీల దగ్గరి నుండి ప్రతి హామీని తుంగలో తొక్కింది వాస్తవం. కాబట్టి తెలంగాణలోని ప్రతి పౌరుడు మోడీ చేస్తున్న మంచిని, రేవంత్ చేస్తున్న మోసాన్ని గుర్తించాలన్నారు.

Next Story