- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందుకే కమ్యూనిస్టులు ప్రజల ఆదరణ కోల్పోయారు: బండి సంజయ్
అసెంబ్లీలో కూనంనేని సాంబశివ రావు వ్యాఖ్యలు సరికాదని బండి సంజయ్ ఖండించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోడీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు(Koonamneni Sambasiva Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీకి చిప్ దొబ్బిందని.. ఇకనైనా మైండ్ సెట్ మార్చుకుంటే బెటర్ అని కూనంనేని మాట్లాడారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అసెంబ్లీలో ఇలాంటి మాటలకు స్థానం లేదని ఖండించారు. ఇలాంటి మాటలతోనే సమాజంలో కమ్యూనిస్టులు ప్రజల ఆదరన కోల్పోయారని అన్నారు. కూనంనేని సాంబశివ రావు తక్షణమే ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి.. ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మాత్రం రాజకీయ ధూషణలకే పరిమితమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని విమర్శలు చేశారు. తెలంగాణ అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలను అనుమతించడమే కాకుండా ఆ మాటలను ఆస్వాదిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నవ్వడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. తక్షణమే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.






