- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay: రంగరాజన్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్‌లో పరామర్శ
రంగారెడ్డి జిల్లాలో ఉన్న చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాన్‌పై డాడి చేసిన ఘటన తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లాలో ఉన్న చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాన్‌పై 20 మంది డాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సీఎస్ రంగరాజన్‌పై దాడిని కేంద్ర హోమ్‌శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఖండించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించినట్లు వెల్లడించారు. అరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ట్వీట్ చేశారు. దాడి జరిగిన తీరుపై ఆరా తీశారు. కాగా, రామరాజ్యం స్థాపనకు మద్దతు నిరాకరించ కపోవడంతో వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి 20 మంది అనుచరులతో (Priest Rangarajan) రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి చేసినట్లు ప్రధాన అర్చకుడి తండ్రి సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎంతో పేరొందిన చిలుకూరి ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడిని హిందూ సంఘాలు, తెలంగాణ ప్రజలు ఖండించారు. అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ నాయకులు సైతం ఖండిస్తున్నారు. నిందితులను ఎంతటి వారైనా సరే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా సోమవారం చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ను బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పార్టీ ఇతర నేతలు పరామర్శించారు.






