Bandi Sanjay: యాంకర్ సూసైడ్ నుంచి దృష్టి మళ్లించేందుకే మీడియా ఆఫీస్ పై దాడి: బండి సంజయ్

by Prasad Jukanti |

మీడియా కార్యాలయంపై దాడి ఘటనను బండి సంజయ్ ఖండించారు.

Bandi Sanjay: యాంకర్ సూసైడ్ నుంచి దృష్టి మళ్లించేందుకే మీడియా ఆఫీస్ పై దాడి: బండి సంజయ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహాన్యూస్ చానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడిని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. మహా న్యూస్‌పై కేసీఆర్ కుమారుడు కేటీఆర్ (KTR) నేతృత్వంలో బీఆర్‌ఎస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇది కేవలం భవనంపై మాత్రమే దాడి కాదని ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని అన్నారు. ఈ మేరకు ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల వేదిక ద్వారా ఆయన స్పందించారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మీ మద్దతుదారులు చాలా మంది మాపై అబద్ధాలు ప్రచారం చేశాని మేమెప్పుడైనా మీ ఇళ్లపైకి ఇలా గుంపులను పంపించామా అని ప్రశ్నించారు. మహా న్యూస్ గతంలో మీకు సపోర్టు చేసిన రోజులు ఏమయ్యాయి? మీకు అండగా నిలబడితే ఒకలా లేకపోతే మరొకలా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు.

యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య (Anchor sweccha suicide) అంశం మీద నుండి ప్రజల దృష్టి మరల్చడానికే ఈ దాడి కోసం బీఆర్ఎస్ తో సంబంధం ఉన్న వ్యక్తులను ప్రోత్సహిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మీ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి భయాన్ని ఉపయోగించినందుకు సిగ్గుపడాలన్నారు. మీరు కెమెరాలను బద్దలు కొట్టవచ్చు, నిజం కాదు. మీరు స్వరాలను నిశ్శబ్దం చేయవచ్చు, ప్రశ్నలను కాదు. మీరు ఛానెల్‌పై దాడి చేయవచ్చు, కానీ జర్నలిజంపై కాదు. మీరు కెమెరాలను ధ్వంసం చేయవచ్చు కానీ సత్యాన్ని ధ్వంసం చేయలేరని, గొంతు నొక్కొచ్చు కానీ ప్రశ్నించడాన్ని కాదు. చానల్ పై దాడి చేయవచ్చు కానీ జర్నలిజంపై కాదన్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Next Story