నేను బతికున్నంత వరకు రాజ్యాంగం మారదు.. BJP ఎంపీ అభ్యర్థి సంచలన ప్రకటన

by Kodari Anjali |   (  Updated:2024-05-03 14:32:32  IST  )

మతం పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ ఫలాలను కట్టబెట్టాలనే కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పికొడతామని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశాడు.

BJP is Ready for Elections, Says Bandi Sanjay
X

దిశ, వెబ్‌డెస్క్: మతం పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ ఫలాలను కట్టబెట్టాలనే కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పికొడతామని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశాడు. బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్‌లను కదిలించడం ఎవరి వల్ల కాదని తేల్చి చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను బీజేపీ అమలు చేస్తుందని వెల్లడించారు. బండి సంజయ్ బతికున్నంత వరకు రాజ్యాంగం మారదని కరాఖండిగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు రద్దు కావని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు బీజేపీ అనుక్షణం అండగా ఉంటుందని ప్రజలకు హామీ ఇచ్చారు.

Next Story