కాంగ్రెస్ నిందలు చిందులు మానాలి : బండి సంజయ్

by Muthe.Rajitha |   (  Updated:2025-07-15 16:23:23  IST  )

బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project) విషయంలో తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నిందలు చిందులు మానాలి : బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్ : బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project) విషయంలో తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) స్పష్టం చేశారు. మంగళవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సమాఖ్య స్ఫూర్తితో, సమ న్యాయంతో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా చూడటమే కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై జరగనున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వాదనను బలంగా వినిపించాలని కోరారు.

బీజేపీపై నిరాధార నిందలు వేయడం, మీడియా ముందు తమపై చిందులు వేయడం మానుకోవాలని సూచించారు. ఈ ప్రాజెక్టు గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు (1980), ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (2014)ను ఉల్లంఘించే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర జలశక్తి మంత్రి సమావేశం ఏర్పాటు చేసైనా సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తమపై ఉందని, తెలంగాణ హక్కులను కాపాడే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తప్పకుండా వస్తుందని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

Next Story