- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Bandi Sanjay: తెలంగాణ పౌరుషాన్ని తట్టి లేపిన స్పూర్తి ప్రదాత.. ప్రొ జయశంకర్ కు బండి సంజయ్ నివాళులు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పౌరుషాన్ని తట్టి లేపిన తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాత అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు.తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ట్వీట్టర్ వేదికగా నివాళులు అర్పించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ట్వీట్ లో.. ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటానికి ఊపునిచ్చిన ఉద్యమ శిఖరం, పుట్టుక మీది, చావు మీది.. బ్రతుకంతా తెలంగాణది అని తెలంగాణ పౌరుషాన్ని తట్టి లేపిన తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాత అని కొనియాడారు.
తెలంగాణ సిద్ధాంత కర్త, ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అని కేంద్ర మంత్రి ఎక్స్ లో రాసుకొచ్చారు. కాగా విద్యార్ధి దశ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కీలక పాత్ర పోషించారు. విద్యార్ధుల్లో తెలంగాణ ఉద్యమ స్పూర్తిని నింపుతూ.. నాయకులకు తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని తెలయజేస్తూ.. పోరాటానికి దిశానిర్ధేశం చేస్తూ అనునిత్యం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జయశంకర్ సార్ పరితపించారు. చివరికి తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్న సమయంలో 2011, జూన్ 21 న మరణించారు.