- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bandi Sanjay: గద్దర్‌పై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. హీటెక్కిన స్టేట్ పాలిటిక్స్
తెలంగాణలో పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మొన్న ఇండ్ల పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే.. పైసలిచ్చేది లేదని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. తాజాగా పద్మ అవార్డుల విషయంలో గద్దర్ నక్సలైట్ భావ జాలం ఉన్న వ్యక్తి అని మాట్లాడటంతో తెలంగాణలో రాజకీయ దూమరం చెలరేగింది. తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్‌పై నిరసనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరుపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ప్రభుత్వం అందజేస్తున్న పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించారు.
తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి గద్దర్‌కు పద్మ అవార్డులకు ప్రతిపాదించడం తప్పా..? నక్సలైట్ భావజాలం ఉంటే అవార్డులివ్వరా..? మావోయిస్టులకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వొచ్చు కానీ, పద్మ అవార్వులు ఇవ్వడానికి పనికిరారా? అని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గద్దర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు సిగ్గుచేటని టీపీపీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌కి తెలంగాణ చరిత్రపై అవగాహనలేదని మండిపడ్డారు. గోరటి వెంకన్న, అందెశ్రీ తెలంగాణ చరిత్రకు మూల స్తంభాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బండి వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు ఆయన దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశాయి. బండి సంజయ్ వెంటనే గద్దర్ అభిమానులకు క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.






