- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్.. కారణమిదే!
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్(Bandi Sanjay) హైకోర్టును ఆశ్రయించారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్(Bandi Sanjay) హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన నాలుగు కేసులు కొట్టేయాలని గురువారం క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు.. ఇటీవలే ఓ కేసులో బండి సంజయ్‌కు హైకోర్టు(Telangana High Court)లో ఊరట కలిగింది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. 2021 నవంబర్ 15న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా భారీ వాహనాలతో కాన్వాయ్ నిర్వహించారని ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉండగా.. ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలోనే మిగిలిన కేసులను కూడా కొట్టివేయాలని ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.






