స్మగ్లర్ బసరత్ ఖాన్ ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్‌ ఎందుకు తిరుగుతున్నారు? బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు

by Ramesh Naini |

కారు పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందని, లగ్జరీ కార్ స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ​ఎందుకు తిరుగుతున్నాడని కేంద్ర మంత్రి బండి సంజయ్​ కుమార్​ ప్రశ్నించారు.

స్మగ్లర్ బసరత్ ఖాన్ ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్‌ ఎందుకు తిరుగుతున్నారు? బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కారు పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందని, లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ (KTR) ​ఎందుకు తిరుగుతున్నాడని కేంద్ర మంత్రి బండి సంజయ్​ కుమార్​ (Bandi Sanjay Kumar) ప్రశ్నించారు. సోమవారం ఎక్స్​వేదిక స్పందిస్తూ ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని సందేహం వ్యక్తం చేశారు. మార్కెట్ ధర చెల్లించారా, లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా అంటూ నిలదీశారు.పేమెంట్లు బినామీ పేర్లతో నకిలీ ఆదాయమా, మనీలాండరింగ్ ద్వారా వచ్చాయని ప్రశ్నించారు. ఈ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు అవుతుందన్నారు.వాస్తవాలు బయటకు వచ్చేందుకు సంబంధిత శాఖలు విచారణ చేపట్టాలని డిమాండ్​చేశారు.

బసరత్​ ఖాన్​తో కేటీఆర్‌కు సంబంధాలు : బండి సంజయ్​

ల్యాండ్ క్రూజర్ వాహనాల స్మగ్లర్ బసరత్ ఖాన్ తో కేటీఆర్ కు సంబంధాలున్నాయని, బసరత్ ఖాన్ స్మగ్లింగ్ చేసిన ల్యాండ్ క్రూజర్ వాహనం కేటీఆర్ ​వాడుతున్నారు. 8 వాహనాలను స్మగ్లింగ్ చేసినట్లు డీఆర్ఐ అధికారుల విచారణలో బసరత్ ఖాన్ ఒప్పుకున్నారు. తాను స్మగ్లింగ్ చేసిన 8 ల్యాండ్ క్రూజర్ల వాహనాల నెంబర్లను అధికారుల ముందు వాంగ్మూలం బసరత్ ఖాన్ ఇచ్చారు. ఆ వాహనాల్లో కేటీఆర్ వాడుతున్న వాహనం కూడా ఉన్నట్లు అంగీకరించినట్లు బయటపడింది. కేటీఆర్ వాడే వాహనం ఎట్ హోం హాస్పిటాలిటీ సర్వీస్ పేరుతో రిజిస్టర్ అయినట్లుగా డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఎట్ హోం కంపెనీపై అదికారులు విచారణ సిద్దమయ్యారు. ఎట్ హోం కు, కేటీఆర్ కుటుంబానికి మధ్య ఉన్న లింక్ పై లోతుగా అధికారులు ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story