చంద్రబాబు కంటే ట్రంప్ గొప్పవాడేం కాదు.. బండి రమేశ్ కామెంట్స్ వైరల్

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu Naidu), మంత్రి లోకేష్‌పై కూకట్‌పల్లి కాంగ్రెస్ నేత బండి రమేశ్(Bandi Ramesh) కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు కంటే ట్రంప్ గొప్పవాడేం కాదు.. బండి రమేశ్ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu Naidu), మంత్రి లోకేష్‌పై కూకట్‌పల్లి కాంగ్రెస్ నేత బండి రమేశ్(Bandi Ramesh) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నగరంలో కమ్మ కుల సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) గొప్పవాడేం కాదని అన్నారు. ట్రంప్ కంటే.. చంద్రబాబు, లోకేష్‌లే గొప్పవారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒకరోజు కమ్మ వాళ్లు ప్రపంచాన్ని ఏలుతారని అన్నారు. కమ్మ కులస్తులు మంచి మనసు ఉన్న వాళ్లని అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఇబ్బందులు తలెత్తినా అండగా ఉంటారని అన్నారు. ప్రస్తుత సమాజంలో కుల సంఘాల ప్రాబల్యం బాగా పెరిగిందన్నారు. సంఘాలు సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని సూచించారు. కమ్మ సామాజిక వర్గం పేదల అభ్యున్నతి కోసం కృషి చేయాలని సూచించారు.

Next Story