- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైకోర్టులో బండి భగీరథ్ బెయిల్ పిటిషన్.. రేపు విచారించనున్న ధర్మాసనం
బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తనపై నమోదైన పోక్సో (POCSO) కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బండి భగీరథ్ (Bandi Bhagirath) ఇవాళ తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తన న్యాయవాదుల ద్వారా బెయిల్ పిటిషన్ దాఖలు చేయించారు. అయితే, బండి భగీరథ్ దాఖలు చేసిన ఆ పిటిషన్‌పై రేపు న్యాయమూర్తి జస్టిస్ కలసికం సుజన (Justice Kalasikam Sujana) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం ఆ విచారణపై ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక భగీరథ్ తాను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో పలు కీలక అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను పూర్తిగా నిర్దోషినని ఆయన పిటిషన్‌లో స్పష్టం చేశారు. తనపై నమోదైన ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని, రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఇప్పటికే విచారణలో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, కేసు నమోదైనప్పటి నుంచి దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించానని.. ఈ క్రమంలో తనకు కేసులో వెంటనే బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.






