Alai Balai: తెలుగు రాష్ట్రాల సీఎంలకు బండారు దత్తాత్రేయ కీలక పిలుపు

by Gantepaka Srikanth |

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి(Revanth Reddy), చంద్రబాబు(Chandrababu)లకు హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) కీలక పిలుపునిచ్చారు.

Alai Balai: తెలుగు రాష్ట్రాల సీఎంలకు బండారు దత్తాత్రేయ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి(Revanth Reddy), చంద్రబాబు(Chandrababu)లకు హర్యాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) కీలక పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని కోరారు. అభివృద్ధి విషయంలో ఒకరికి ఒకరు ఆటంకాలు కలిగించుకోవద్దని చెప్పారు. ఎన్ని సమస్యలు వచ్చినా పరస్పరం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. అలయ్ - బలయ్‌తో తెలుగు ప్రజలంతా కలిసి ఉండే వాతావరణం నిర్మాణం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, సీపీఐ నేత నారాయణ, ప్రొఫెసర్‌ కోదండరామ్, మాజీ ఎంపీ వీహెచ్, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సహా రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు హాజరయ్యారు.

Next Story