మాజీ డీఎస్పీ నళిని ఆరోగ్యంపై ప్రధాని దృష్టికి తీసుకెళ్తా : బండారు ​దత్తాత్రేయ

by Ramesh Naini |

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తనదైన పాత్ర పోషించి, ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మాజీ డీఎస్పీ నళిని ఆరోగ్య పరిస్ధితిపై మాజీ గవర్నర్​ బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ డీఎస్పీ నళిని ఆరోగ్యంపై ప్రధాని దృష్టికి తీసుకెళ్తా : బండారు ​దత్తాత్రేయ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తనదైన పాత్ర పోషించి, ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మాజీ డీఎస్పీ నళిని (Former DSP Nalini) ఆరోగ్య పరిస్ధితిపై మాజీ గవర్నర్​ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatraya) ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆమెతో ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశానని, వారు వ్యక్తపరిచిన విషయం తనకు బాధ కలిగిందన్నారు. గతంలో ఏ విశ్వాసంతో, ఏ నిబద్ధతతో జీవితం గడిపారో అదే విధంగా ముందుకు సాగాలని, ఆరోగ్యం విషయంలో బాధ పడాల్సిన అవసరం లేదని ప్రోత్సహించానని తెలిపారు. ఆయుర్వేద వైద్య విధానాల ద్వారా పూర్తి ఆరోగ్యవంతురాలిగా మారుతారని తనకు గట్టి నమ్మకం ఉందని, ఇందుకోసం నాకు సుపరిచితులైన (Ramdev Baba) రామ్ దేవ్ బాబాను సంప్రదించానని, హరిద్వార్‌లో ఆయుర్వేద చికిత్స అందించేందుకు వారు అంగీకరించారని వెల్లడించారు.తన ఆరోగ్య విషయాలను (Prime Minister) ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లాలని ఆమె అభ్యర్థన మేరకు తప్పకుండా తాను లేఖ ద్వారా తెలిపిన వైద్య సహాయాన్ని అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. నళిని త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహం, ఆరోగ్యంతో సమాజానికి సేవ చేస్తారని భావించారు.

Next Story