- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెలాఖరులోపు ఫ్రీడం ఫైటర్స్ పెన్షన్ కేసులను పరిష్కరించాలి
స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ కేసులను ఈనెలాఖరు లోపు పరిష్కరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు

నెలాఖరులోపు ఫ్రీడం ఫైటర్స్ పెన్షన్ కేసులను పరిష్కరించాలి
పెండింగ్‌లో ఉన్న శత్రు ఆస్తులపై తక్షణమే సర్వే చేపట్టాలి
అధికారులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదేశం
దిశ, తెలంగాణ బ్యూరో : స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ కేసులను ఈనెలాఖరు లోపు పరిష్కరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న శత్రు ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీస్) సమస్యలను పరిష్కరించేందుకు సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటి వరకు ఎనిమీ ప్రాపర్టీస్ విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.107 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ లోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న మిగిలిన పెన్షన్ దరఖాస్తులను సైతం వేగవంతం చేసి పరిష్కరించాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వాల నుండి అవసరమైన పత్రాలు అందకపోవడంతో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెప్పడంతో వెంటనే రాష్ట్రాలకు లేఖలు పంపాలని స్వాతంత్ర సమరయోధులు, పునరావాస విభాగం జాయింట్ సెక్రటరీని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాల నుండి పత్రాలను సేకరించి, పెన్షన్ మంజూరును వేగవంతం చేయడానికి ప్రత్యేక బృందాలను రాష్ట్రాలకు పంపాలని కోరారు. శత్రు ఆస్తుల విషయంలో ఉన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత విభాగం అధికారులకు సూచించారు. అందులో భాగంగా యుద్ద ప్రాతిపదికన సర్వే, సరిహద్దు నిర్ధారణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ కేసుల పురోగతిపై పూర్తి వివరాలు అందించాలన్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో శత్రు ఆస్తులు ఉన్న రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ వెంటనే ఆయా రాష్ట్రాలకు లేఖలు పంపి, సమావేశాలు నిర్వహించాలన్నారు. వచ్చే నెలలో సీఈపీఐ శాఖ కార్యాలయాలను సందర్శించి పురోగతిని సమీక్షించనున్నట్లు ప్రకటించారు.
..ఈ సందర్భంగా అధికారులు దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్లు, శత్రు ఆస్తుల ఆర్థికీకరణ, శరణార్థుల పునరావాసంపై సమగ్ర నివేదిక అందజేశారు. స్వాతంత్ర్య సైనిక్ సత్కార యోజన కింద పెండింగ్‌లో ఉన్న స్వాతంత్ర్య సమరయోధులు, వారిపై ఆధారపడ్డ జీవిత భాగస్వాములు, కుమార్తెల పెన్షన్ కేసుల పరిష్కారంలో సాధించిన పురోగతి వివరాలను సైతం వివరించారు. స్వాతంత్ర్య సైనిక్ సత్కార యోజన కు సంబంధించి హోంమంత్రిత్వ శాఖవద్ద 26 వేల 623 మంది ఫైళ్లు పెండింగ్ లో ఉండగా, ఇప్పటి వరకు 13 వేల మందికిపైగా పరిష్కరించినట్లు తెలిపారు. దాదాపు 12212 మందికి లబ్ది చేకూరినట్లు పేర్కొన్నారు. అట్లాగే స్వాతంత్ర్య సమర యోధుల పెన్షన్లకు సంబంధించి 8829 ఫైళ్లు పెండింగ్ లో ఉండగా, ఇప్పటి వరకు 6700 ఫైళ్లను క్లియర్ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు 2103 మందికి లబ్ది చేకూరినట్లు తెలిపారు. వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
- Tags
- BANDI SANJAY
- BJP






