- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ విద్యాశాఖలో భారీ బదిలీలు.. ఆ ఏడుగురు అధికారులకు స్థానచలనం
తెలంగాణ విద్యాశాఖలో బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో 111 జారీ చేసింది. పరిపాలనా కారణాలతో ఏడుగురు జేడీలు బదిలీ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ పాఠశాల విద్యాశాఖలో బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా కారణాల దృష్ట్యా విద్యాశాఖకు చెందిన ఏడుగురు జాయింట్ డైరెక్టర్లను (JD) బదిలీ చేస్తూ ప్రభుత్వం జీవో 111 ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమలుల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. విద్యాశాఖలో సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఈ బదిలీల ప్రక్రియతో కీలక విభాగాల్లో కొత్త అధికారుల బాధ్యతల స్వీకరణకు మార్గం సుగమమైంది.
బదిలీ అయిన అధికారుల వివరాలు:
1.పి. రాజీవ్: సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ స్థానం నుండి హైదరాబాద్‌లోని 'తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ' (TOSS) జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.
2.ఎం. సోమిరెడ్డి: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ జాయింట్ డైరెక్టర్ స్థానం నుండి హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (RJD)గా నియమితులయ్యారు.
3.కె.సత్యనారాయణ రెడ్డి: వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (RJD) స్థానం నుండి మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. అదనంగా ఈయనకు అడిషనల్ డైరెక్టర్ (C) పూర్తి అదనపు బాధ్యతలను (FAC) అప్పగించారు.
4పి. మదన్ మోహన్: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయ జాయింట్ డైరెక్టర్ (Ser) స్థానం నుండి హైదరాబాద్ సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ (I)గా బదిలీ అయ్యారు.
5.ఏ. ఉషారాణి: మాసాబ్ ట్యాంక్ ఐఏఎస్‌ఈ (IASE) ప్రిన్సిపాల్ స్థానం నుండి హైదరాబాద్ సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ (II)గా నియమితులయ్యారు.
6..బి. వెంకట నరసమ్మ: సమగ్ర శిక్ష జాయింట్ డైరెక్టర్ స్థానం నుండి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయ జాయింట్ డైరెక్టర్ (Ser)గా బదిలీ అయ్యారు.
7.ఈ.విజయలక్ష్మి: హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (RJD) స్థానం నుండి వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (RJD)గా బదిలీ అయ్యారు.






