బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు అయింది.

బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌(Balka Suman)కు బెయిల్ మంజూరు అయింది. క్యాతన్‌పల్లి ఘటనలో అరెస్టై జైలులో ఉన్న ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై మంచిర్యాల జిల్లా కోర్టు(Mancherial District Court)లో ఈరోజు వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు బెయిల్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల సందర్భంగా ఎక్స్‌ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న మంత్రి వివేక్‌, ఎంపీ వంశీ కాన్వాయ్‌పై బీఆర్‌ఎస్‌ నాయకులతో పాటు బాల్క సుమన్‌ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మంత్రి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఎస్‌ఐ గంగారాం, కానిస్టేబుల్‌ నరేశ్‌, కాంగ్రెస్‌ నాయకులు వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదుతో బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం మంచిర్యాల కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి 14రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించారు. అనంతరం సుమన్‌ను ఆదిలాబాద్‌ జైలుకు తరలించారు.

Next Story