రాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విసిరితే కేసులు మాపై పెట్టారు.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-18 11:15:20  IST  )

మంత్రి వివేక్ పై బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. రాళ్లు కాంగ్రెస్ వాళ్లు విసిరితే పోలీసులు తమపై లాఠీచార్జ్ చేశారని అన్నారు. కేసులు కూడా తమ పైనే పెట్టారని చెప్పారు.

రాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విసిరితే కేసులు మాపై పెట్టారు.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: చెన్నూర్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నట్టుగా వివాదం కొనసాగుతోంది. నువ్వా నేనా అంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా సుమన్ మంత్రి వివేక్ పై ఫైర్ అయ్యారు. రాళ్లు కాంగ్రెస్ వాళ్లు విసిరితే పోలీసులు తమపై లాఠీచార్జ్ చేశారని అన్నారు. కేసులు కూడా తమ పైనే పెట్టారని చెప్పారు. దాడి వాళ్లు చేస్తే కేసులు మాపై పెడతారా అంటూ ఫైర్ అయ్యారు.

నిజంగా పోలీసులకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే వీడియో ఫుటేజ్ చూడాలి కదా అని ప్రశ్నించారు. వివేక్ కు ఊడిగం చేస్తూ దద్దమ్మల లాగా తమపై కేసులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరులో 18 వార్డులకు కాంగ్రెస్ కు 11 వార్డులు వస్తే తాము దాంట్లో వేలు పెట్టలేదన్నారు. కానీ క్యాతనపల్లిలో 22 వార్డులకు బీఆర్ఎస్ కు 14 వస్తే, ఎందుకు ప్రజా తీర్పును హత్య చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్, MRO తమ అభ్యర్థులకు ఫోన్ చేసి మీ ఇండ్లు కూల్చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. మంత్రి వివేక్ స్ట్రాంగ్ కౌంటర్

Next Story