నేను జైలుకు వెళ్లినా క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ గెలవదు: బాల్క సుమన్

by Ajay Maddhiboyina |

త‌న‌ను జైలుకు పంపి క్యాత‌న‌ప‌ల్లి మున్సిపాలిటీని గెల‌వాల‌ని కుట్ర చేస్తున్నార‌ని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ అన్నారు. పోలీసులు మంచిర్యాల కోర్టులో హాజ‌రుప‌ర్చిన అనంత‌రం సుమ‌న్ మీడియాతో మాట్లాడారు.

నేను జైలుకు వెళ్లినా క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ గెలవదు: బాల్క సుమన్
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌న‌ను జైలుకు పంపి క్యాత‌న‌ప‌ల్లి మున్సిపాలిటీని గెల‌వాల‌ని కుట్ర చేస్తున్నార‌ని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ అన్నారు. పోలీసులు మంచిర్యాల కోర్టులో హాజ‌రుప‌ర్చిన అనంత‌రం సుమ‌న్ మీడియాతో మాట్లాడారు. త‌న‌ను జైలుకు పంపినా క్యాత‌న‌ప‌ల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెల‌వ‌ద‌ని అన్నారు. ప్ర‌జ‌లు అన్ని గ‌మ‌నిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే క్యాతన‌ప‌ల్లి మున్సిపాలిటీ ఎన్నిక హైడ్రామాగా సాగుతోంది.

రాష్రంలోని ఇత‌ర మున్సిపాలిటీల‌కు ఛైర్మ‌న్ ల‌ను ఎన్నుకున్నప్ప‌టికీ ఇక్క‌డ మాత్రం ఇంకా స‌స్పెన్స్ గానే ఉంది. ఇక్కడ మొత్తం 22 వార్డులుండగా బీఆర్ఎస్, సీపీఐ కలిసి 14 వార్డులు గెలిచాయి. కాంగ్రెస్ 7వార్డులు, ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. దీంతో హంగ్ ఏర్పడింది. మంగళవారం చైర్మన్ ఎన్నిక సమయంలో రచ్చరచ్చ జరగడంతో వాయిదాపడింది. ఇక బాల్క సుమన్ అరెస్ట్ తో మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు బంద్ కు పిలుపునిచ్చారు.

Next Story