Farmhouse Bets : పట్టుబడిన ఫాంహౌజ్ పందెం కోళ్లకు భలే గిరాకీ !

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-18 05:48:07  IST  )

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC) పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(Pochampally Srinivas Reddy) కు చెందిన హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం తోల్కట్ట ఫాంహౌజ్(Tolkatta Farmhouse)లో పట్టుబడిన పందెం కోళ్ల(Bets)వేలం పాట పోటాపోటీ(Auction Song)గా సాగడం ఆసక్తికరంగా మారింది.

Farmhouse Bets : పట్టుబడిన ఫాంహౌజ్ పందెం కోళ్లకు భలే గిరాకీ !
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC) పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(Pochampally Srinivas Reddy) కు చెందిన హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం తోల్కట్ట ఫాంహౌజ్(Tolkatta Farmhouse)లో పట్టుబడిన పందెం కోళ్ల(Bets)వేలం పాట పోటాపోటీ(Auction Song)గా సాగడం ఆసక్తికరంగా మారింది. పందెం రాయుళ్ల పోటాపోటీగా పందెం కోళ్లను దక్కించుకునేందుకు వేలం పాటలు పాడారు. ఫాంహౌజ్ పై దాడి సందర్భంగా పోలీసులు 85పందెం కోళ్లు స్వాధీనం చేసుకోగా, వాటిలో ఒకటి చనిపోయింది.

మిగిలిన వాటిని రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి వేలంపాట నిర్వహించడంతో.. వేలంపాట సమాచారం అందుకున్న పందెం రాయుళ్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేలం పాటలో 84 కోళ్లు రూ. 16.65 లక్షలకు అమ్ముడుపోవడం విశేషం. పందెం కోళ్ల కోసం వేలం పాటలో ఏపీలోని రాజమహేంద్రవరం, ఏలూరు, నూజివీడు తదితర ప్రాంతాలకు చెందిన వారితో పాటు ఇదే కేసులోని నిందితుల అనుచరులు సైతం పాల్గొని తమ కోళ్లను దక్కించుకున్నారు.

ఈ నెల 12న హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం తోల్కట్టలో ఓ ఫాంహౌస్లో కోడి పందేలు నిర్వహిస్తుండగా పోలీసులు జరిపిన దాడుల్లో 64 మంది పట్టుబడగా..86 పందెం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న భూపతి రాజు శివకుమార్‌‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ దాడిలో మొత్తం 64 మందిని అరెస్టు చేశారు. పందాలకు వినియోగిస్తున్న రూ.30 లక్షల నగదు, 55 లగ్జరీ కార్లు, పందాల కోసం ఉపయోగించే 86 కోళ్లు, కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో 10 మంది తెలంగాణకు చెందిన వారు కాగా.. మిగిలిన వారు అంతా ఏపీ వాసులే. ఈ వ్యవహారంపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో గేమింగ్ చట్టం, జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం కింద కేసు నమోదు అయ్యాయి.

అయితే ఈ ఫామ్‌హౌస్ యజమానిగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉండటంతో ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే తన న్యాయవాదితో కలిసి మొయినాబాద్‌ పోలీసులకు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. ఈ కోడిపందాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. కోడి పందాలు ఆడించిన ఫామ్ హౌస్ తనదేనని 2023లో వర్రా రమేష్ కుమార్ రెడ్డికి లీజ్‌కు ఇచ్చినట్లు పోచంపల్లి పేర్కొన్నారు.ర మేష్ కుమార్‌తో పాటు మరొకరి కూడా లీజ్‌కు ఇచ్చినట్లు వెల్లడించారు.

లీజ్ పత్రాలను కూడా పోలీసులకు అందజేశారు పోచంపల్లి. లీజ్‌కు ఇచ్చిన భూమిని ఏపీకి చెందిన వ్యాపారి భూపతి రాజు శివ కుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు.

Next Story