- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎక్కడికక్కడ కరాచీ బేకరీలను ధ్వంసం చేస్తున్న భజరంగదళ్
భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భజరంగదళ్(Bajrang Dal) నాయకులు మరోసారి రెచ్చిపోయారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భజరంగదళ్(Bajrang Dal) నాయకులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలోని కరాచీ బేకరీపై దాడి చేశారు. బేకరీ నేమ్ బోర్డుతో పాటు ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పాకిస్తాన్ పేర్లతో వ్యాపారం చేస్తే దాడులు తప్పవని హెచ్చరించారు. కాగా, కరాచీ బేకరీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. వెజ్ స్నాక్స్, నాణ్యమైన, రుచికరమైన కేకులు, కుకీస్, ఇతర చిరుతిళ్లకు కరాచీ బేకరి పెట్టింది పేరు. అయితే.. మొన్నటి వరకు వీరి వ్యాపారం సాఫీగానే సాగింది. జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాంలో ఉగ్రదాడుల తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కరాచీ బేకరీ బ్రాంచెస్‌లో భజరంగదళ్ నాయకులు దాడులు చేస్తున్నారు. బేకరీ పేర్లు మార్చి వ్యాపారం చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. మరోవైపు.. వరుస దాడులపై కరాచీ బేకరి వ్యవస్థాకుడి వారసులు ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో తమకు అండగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ, కమిషనర్‌లను అభ్యర్థించారు. తమది హైదరాబాద్ అని.. ఇది పాకిస్థాన్ బ్రాండ్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు.






