Seethakka: ఆడబిడ్డలకు చీరలు ఇస్తుంటే కేటీఆర్, హరీశ్ రావు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు: సీతక్క

by Prasad Jukanti |

ఇందిరమ్మ చీరలపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేయడం తగదని మంత్రి సీతక్క అన్నారు.

Seethakka: ఆడబిడ్డలకు చీరలు ఇస్తుంటే కేటీఆర్, హరీశ్ రావు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు: సీతక్క
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఓర్వలేకే బీఆర్ఎస్ విమర్శలు.. మంత్రి సీతక్క ఇందిరమ్మ చీరలపై (Indiramma sarees) బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేయడం తగదని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. ఆడబిడ్డలు, మహిళా సంఘాలు ఎంపిక చేసుకున్న డిజైన్లలోనే చీరలని ఇస్తున్నామని, అయినా కలర్ బాగాలేదని, డిజైన్ బాగాలేదని బీఆర్ఎస్ వాళ్లు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సహజంగానే ఆడవాళ్లు ఎదుగుతుంటే ఓర్వలేనితనం కేటీఆర్(KTR) , హరీశ్‌రావులదని (Harish Rao) విమర్శించారు. ఆడబిడ్డలు చీరలు తీసుకుని సంబరపడుతుంటే వారు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్‌లాగా ఇవి సూరత్ నుంచి కిలోల లెక్కన తీసుకొచ్చిన చీరలు కాదని, సిరిసిల్ల నేతన్నలు తమ చేతితో స్వయంగా నేసిన చీరలని మంత్రి స్పష్టం చేశారు. కావాలంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత స్వయంగా సిరిసిల్ల వెళ్లి నేతన్నలను వెళ్లి అడిగి తెలుసుకోవాలన్నారు. కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు కావాలని చీరలు బాగా లేవంటూ మాట్లాడటం సిరిసిల్ల నేతన్నలని అవమానించేలా ఉన్నాయన్నారు. చీరలను మహిళా సంఘాల వారికే ఇస్తున్నామని ఆరోపణలు అవాస్తవం అని మహిళా సంఘాల సభ్యులకు ఇస్తూనే సభ్యత్వం లేని వారిని సైతం సంఘంలోకి ఆహ్వానిస్తూ వారికి సారె పెడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఏం చేసినా బీఆర్ఎస్ నేతలు ఓర్చుకోవడం లేదని ఫ్రీ బస్సు పెడితే బ్రేక్ డాన్స్ చేసుకోవాలని, కొట్టుకుంటున్నారని దుష్ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా తమ బుద్ధి మార్చుకుని మహిళలకు మంచి జరుగుతుంటే స్వాగతించడం సంతోషించడం నేర్చుకోలని సూచించారు.

కాగా ఇందిరమ్మ చీరల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అక్కా చెల్లాల ఆశీస్సులు ఉన్నంతకాలం మన ప్రభుత్వంని బీఆర్ఎస్ ఏం చేయబోదని అధికార కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంటే ఇచ్చిన అసలు హామీలు పక్కన పెట్టి చీరలు పంచుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది.

Next Story