- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా.. మంత్రి అజారుద్దీన్ హెచ్చరిక
అజారుద్దీన్ దేశద్రోహి అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తనను దేశద్రోహి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసి వ్యాఖ్యలపై మంత్రి అజారుద్దీన్ (Azharuddin) సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. కిషన్ రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యలను ఇప్పటికే ఖండించిన అజారుద్దీన్ శనివారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్ (Legal Action) తీసుకుంటానని హెచ్చరించారు. ఇవాళ ఓన్యూస్ చానల్ తో మాట్లాడిన అజారుద్దీన్.. నాపై వచ్చిన ఆరోపణలపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన నేను దేశ ద్రోహినా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bypoll) కోసమే బీజేపీ నన్ను టార్గెట్ చేసిందని దుయ్యబట్టారు. కిషన్ రెడ్డికి క్రికెట్ గురించి ఏం తెలుసు? కిషన్ రెడ్డికి కనీసం క్రికెట్ బ్యాట్ అయినా పట్టుకోవడం వచ్చా అని విమర్శించారు. మాట్లాడటానికి ఏమి లేక మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఆర్నెళ్లలోపు అజారుద్దీన్ ఎమ్మెల్సీ కాలేరని ఆయన మంత్రి పదవి కేవలం ఆరు నెలల పాటే అంటూ వస్తున్న విమర్శలపై స్పందిస్తూ అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందన్నారు.






