నంబాల కేశవరావు తర్వాత ఎవరో తెలియదు.. పోలీసుల సమక్షంలో ఆజాద్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-11-22 11:44:43  IST  )

ఇవాళ సరెండర్ అయిన ఆజాద్ పోలీసుల సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

నంబాల కేశవరావు తర్వాత ఎవరో తెలియదు.. పోలీసుల సమక్షంలో ఆజాద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాము మావోయిస్టు పార్టీకి (Maoist Party) చెప్పే సరెండర్ అయ్యామని ఆజాద్ (Azad) తెలిపారు. ఇవాళ డీజీపీ ఎదుట మొత్తం ౩౭ మంది మావోయిస్టులతో పాటు లొంగిపోయిన ఆజాద్.. ఈ సందర్భంగా డీజీపీ ఎర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు అనేది తమకు తెలియదని, ఆ సమాచారం అందలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీకి ప్రస్తుతం ఇన్‌చార్జిగా దామోదర్ వ్యవహరిస్తున్నారని, కమిటీలో వెంకన్న కీలకంగా ఉన్నారని, వీరు కూడా ఆలోచించి జనజీవన స్రవంతిలో కలవాలని ఆజాద్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ పిలుపు మేరకే తాము సరెండర్ అవుతున్నామన్నారు.

Next Story