- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు అవగాహన సదస్సులు : మంత్రి తుమ్మల
రాష్ట్రంలోని రైతాంగానికి సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ప్రభుత్వం చేపట్టనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని రైతాంగానికి సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ప్రభుత్వం చేపట్టనుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రేపటి నుంచి జూన్ 13 వరకు రాష్ట్రంలోని సుమారు 1200 గ్రామాలలో నిర్వహించేందుకు 200 పైగా శాస్త్రవేత్తల బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ దక్షిణ తెలంగాణ మండలాల్లో సుమారు 100 బృందాలు, ఉత్తర, మధ్య తెలంగాణ మండలాల్లో సుమారు 50 బృందాలు పాల్గొంటాయన్నారు. ఒక్కో బృందం వారి రోజూవారి కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు, వారంలోని పని దినాలలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపిక చేసుకున్న గ్రామాలలోని రైతు వేదికల్లో కానీ ఇతర ప్రదేశంలో రైతులకు యూరియా వాడకం తగ్గించడం, రసాయనాలను జాగ్రత్తగా వాడటం, చెల్లింపు రశీదులను భద్రపరచడం, సాగు నీటి ఆదా, పంటల మార్పిడి, చెట్లను పెంచటంపై అవగాహన కల్పిస్తారన్నారు.
అదే విధంగా రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళకు సూచనలు, సలహాలు ఇస్తారని, ఒక్కో బృందంలో ఇద్దరు శాస్త్రవేత్తలతోపాటు వ్యవసాయ విద్యార్థులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర స్థానిక ప్రభుత్వ అధికారులు, అభ్యుదయ రైతులు, సంఘాలు పాల్గొంటారు. వీరితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. విశ్వవిద్యాలయంలోని అన్ని వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్స్, వ్యవసాయ పరిశోధనా సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయ శాఖ సహకారంతో నిర్వహిస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని, కాని గత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోనందున రైతులు ఇలాంటి అవకాశాలను దూరం చేసుకున్నారన్నారు. కానీ మా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల శ్రేయస్సుకోసం, రైతులకు వ్యవసాయ సంబంధిత వివిధ అంశాలపై అవగాహన కల్పించేదిశగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. రైతులు పెద్ద ఎత్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, వారికి వ్యవసాయ సంబంధిత అంశాలపై గల అనుమానాలను శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు.






