అలయబాద్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు

by Malleboina Mahesh |   (  Updated:2025-08-28 17:26:58  IST  )

హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం అలయబాద్‌లోని ఎన్‌పిఆర్ ఫంక్షన్ హాల్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు జరిగింది.

అలయబాద్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్థిక సేవలు, భారత ప్రభుత్వ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న మూడు నెలల ఆర్థిక సాధికారత ప్రచారంలో భాగంగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం అలయబాద్‌లోని ఎన్‌పిఆర్ ఫంక్షన్ హాల్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి ముఖ్యమైన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి కూలంకషంగా చర్చించారు. సైబర్ నేరాల నుంచి వినియోగదారులను రక్షించడంలో ముఖ్యపాత్ర పోషించే రీకేవైసీ ప్రాముఖ్యతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

ఆర్‌బీఐ ఏజీఎం రెహమాన్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రామిరెడ్డి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్‌డిఎం) శివప్రసాద్ రీకేవైసీ ప్రయోజనాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ జనరల్ మేనేజర్ ఎ.డి. శ్రీనివాస్, హైదరాబాద్ జోనల్ హెడ్ దారాసింగ్ నాయక్, ప్రాంతీయ హెడ్ దిలీప్ కుమార్ భరన్వాల్, మున్సిపల్ కమిషనర్ కార్యాలయం మేనేజర్ శ్రీనివాస్, అలయబాద్ బ్రాంచ్ మేనేజర్ ఎస్. మాధురి, చీఫ్ మేనేజర్ (ప్రాంతీయ మార్కెటింగ్) కె. ఉమాజానకితో పాటు బ్యాంకులోని ఇతర అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడానికి గాను రూ. 5,36,22,000 విలువైన చెక్కును అందజేశారు.

Next Story