- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రగ్స్ జోలికి వెళ్లకుండా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ
సమాజంలో ఇటీవల కాలంలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగిపోయింది. యువకులు, యువతులు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో ఇటీవల కాలంలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగిపోయింది. యువకులు, యువతులు అనే తేడా లేకుండా విచ్చలవిడిగా మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు. ఈ మత్తులో దారుణాలకు తెగబడుతున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలోని కబీర్ నగర్ zphs పాఠశాలలోని విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్ధాలపై 'షేర్ ఏ సర్వీస్' సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు విశాల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ ఎస్ఐ నాయుడు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు శాంతి, ఉపాధ్యాయులు, నేను విశాల గుమ్ములూరు, అల్కా అగర్వాల్ పాల్గొన్నారు. అంతేగాక, మత్తు పదార్థాలకు ఎప్పుడూ దూరంగా ఉండాలని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
Next Story






