ACB డైరెక్టర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అవినాష్ మ‌హంతి!

by Ajay Maddhiboyina |

తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

ACB డైరెక్టర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అవినాష్ మ‌హంతి!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల జరిగిన పోలీసు అధికారుల బదిలీలు మరియు నియామకాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ఏసీబీ బాధ్యతలకు ఎంపిక చేయ‌గా నేడు బాధ్య‌త‌లు స్వీకిరంచారు. మ‌రోవైపు ఆయ‌న డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు.

అవినాష్ మ‌హంతి గ‌తంలో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. మల్కాజ్‌గిరి కంటే ముందు దాదాపు రెండేళ్లపాటు కీలకమైన సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ అధిపతిగా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. తన వృత్తిప‌ర‌మైన‌ కెరీర్ లో అవినాష్ మహంతి శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌, నేరాల అదుపులాంటి వివిధ హోదాల‌లో ప‌నిచేశారు. ఇప్పుడు ఏసీబీ డైరెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డంతో రాష్ట్రంలో అవినీతి నిర్మూల‌న‌కు ఎలా కృషి చేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story