- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అవతార్’ హీరో.. మన నటులతో సెల్ఫీ దిగితే.. ఫన్నీ AI వీడియో వైరల్
ప్రస్తుతం డిజిటల్ యుగం పూర్తిగా హవా చూపిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంతో క్రియేటర్లు ఊహకందని కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం డిజిటల్ యుగం పూర్తిగా హవా చూపిస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంతో క్రియేటర్లు ఊహకందని కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా అలాంటి ఒక ఫన్నీ AI వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అవతార్’ హీరో జేక్ సల్లి (Sam Worthington) మన ఇండియన్ స్టార్ హీరోలతో సెల్ఫీలు దిగితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో వీడియోను రూపొందించారు. AI టెక్నాలజీ సహాయంతో క్రియేట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోలో జేక్ సల్లి.. మహేశ్ బాబు, బాలకృష్ణ, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రానా దగ్గుబాటి, రజినీకాంత్, కమల్ హాసన్, కన్నడ స్టార్ యశ్, బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రణబీర్ కపూర్ తదితర ప్రముఖ నటుల ఫేమస్ సినిమా క్యారెక్టర్లతో సరదాగా సెల్ఫీలు దిగుతున్నట్లు చూపించారు. ప్రతి సెల్ఫీ కూడా ఆయా హీరోల స్టైల్, ఎక్స్‌ప్రెషన్స్‌కు తగ్గట్టుగా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సుమారు 1 నిమిషం 14 సెకన్ల నిడివి ఉన్న ఈ AI వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ (X), ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో భారీగా షేర్ అవుతోంది. AI టెక్నాలజీతో క్రియేటివిటీకి హద్దుల్లేవని మరోసారి నిరూపించిన ఈ వీడియో, సినీ అభిమానులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తోంది. ట్వీట్ ఇదే..






