- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బడాపహాడ్ దర్శనానికి వెళ్తుండగా ఆటో బోల్తా.. ఇద్దరు స్పాట్ డెడ్
by Sathputhe Rajesh |
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడా పహాడ్ వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడా పహాడ్ వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రముఖ దర్గాలో ఒకటైన బడాపహాడ్‌ను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఉన్నఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఐదుగురికి గాయా లయ్యాయి. మృతి చెందిన వారిలో హైమది(50) మోయిన్ (42 )లను కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ వాసులుగా గుర్తించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ నిద్ర మత్తు ప్రమాదానికి కారణమని తెలిసింది.
Next Story






