- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ టు ముంబై.. మెడిసిన్ రవాణాకోసం స్పెషల్ ట్రైన్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
అత్యాధునిక సేవలను కల్పించడంలో నూతన సాంకేతికతలు, ఆవిష్కరణలతో భారతీయ రైల్వే దూసుకపోతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : అత్యాధునిక సేవలను కల్పించడంలో నూతన సాంకేతికతలు, ఆవిష్కరణలతో భారతీయ రైల్వే దూసుకపోతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ నుంచి ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ కు ఔషధాలను సరఫరా చేసేందుకు ఔషధి ఎక్స్‌ప్రెస్’ పేరుతో ప్రత్యేక ఫార్మసీ రైలును కేంద్రం ప్రారంభించడం హర్షనీయమన్నారు. మొదటి రెగ్యులర్ ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’ ప్రత్యేక రైలును తెలంగాణకు కేటాయించడం గర్వంగా ఉందన్నారు. సోమవారం ప్రధాని మోడీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా పేర్కొంటూ ప్రత్యేక రీఫర్ రైలును ప్రారంభించడం హైదరాబాద్ ఫార్మా కంపెనీలకు చాలా మేలు జరగడంతో పాటు దేశవ్యాప్తంగా, వివిధ దేశాలకు సరైన సమయంలో ఔషధాలను చేరవేసేందుకు వీలు కలుగుతుంది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా, పటాన్‌చెరులోని ఫార్మా జోన్, ముచ్చర్ల లోని ఫ్యూచర్ సిటీ తదితర ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే ఫార్మా ప్రొడక్ట్స్ సరఫరాకు ఈ రైలు చాలా కీలకం కానుంది.
ఫ్రీజర్ ఫెసిలిటీ లేకపోతే చాలా వరకు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ నాణ్యత తగ్గుతుందని, హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో తయారయ్యే మందులను వాటి నాణ్యత తగ్గకుండా సరఫరా చేయాలనేది మోదీ సర్కారు సంకల్పమన్నారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న సనత్ నగర్ లోని ఇన్ ల్యాండ్ కంటైనర్ డిపో నుండి ఈ ప్రత్యేక రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఔషధి ఎక్స్‌ప్రెస్’గా నామకరణం చేసిన ఈ రెఫ్రిజిరేటర్ రైలు ద్వారా లైఫ్ సేవింగ్ మందులతో పాటు అవసరమైన ఇతర సరుకులను కూడా రవాణా చేయనున్నారు. కంటిన్యూయస్ రిఫ్రిజిరేషన్ ఉండేందుకు డీజిల్ పవర్ ప్యాక్‌లతో కూడిన అధునాతన రీఫర్ కంటైనర్లను వినియోగిస్తున్నారు. ఇది మన కోల్డ్-చైన్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంతో పాటుగా మన ఫార్మాసూటికల్స్ సప్లయ్ చైన్ కెపాసిటీని పెంచేందుకు కీలకమైన ముందడుగు కానుంది. ప్రస్తుతానికి వారానికి ఒకసారి నడుస్తున్న ఈ ‘ఔషధి ఎక్స్‌ప్రెస్ డిమాండ్, వాణిజ్య వర్గాల అవసరాలకు అనుగుణంగా వారానికి రెండుసార్లు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నొవేషన్ బేస్డ్ సొల్యూషన్స్ తీసుకురావడంలో మోడీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది.






