పెద్ద మనవడిపై తాత ప్రేమను ఓర్వలేక బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని

by Prasad Jukanti |

ఇంట్లో తన కొడుకును చిన్న చూపు చూస్తున్నారనే కారణంతో తోడికోడలి కుమారుడి పట్ల రాక్షసంగా వ్యవహరించిందో మహిళ.

పెద్ద మనవడిపై తాత ప్రేమను ఓర్వలేక బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
X

దిశ, డైనమిక్ బ్యూరో: మన కళ్లను మనమే నమ్మలేని స్థాయిలో నేరాలు జరుగుతున్నాయి. తాజాగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన క్రైమ్ మానవత్వాన్ని మంటగలిపేలా ఉంది. తన కొడుకును ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారనే కారణంతో నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిందో (Acid Attack) పిన్ని. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ (Boduppal) శ్రీనివాస కాలనీలో ఉండే పర్వతం సతీశ్ కుమార్ అంజమ్మ దంపతులకు నాగరాజు, జగదీశ్ ఇద్దరు కుమారులు. వీరికి వివాహాలు అయి పిల్లలు కూడా ఉన్నారు. అంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే పెద్ద కుమారుడి కొడుకు (4)పై తాతా ఎక్కువ ప్రేమ చూపిస్తూ తమ బిడ్డను పట్టించుకోవడం లేదని చిన్న కొడకు భార్య మంజుల కక్ష పెంచుకుంది. ఇటీవల తాత తన చేతిపై పెద్ద మనవడి పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు. దీంతో మరింత కోపం పెంచుకున్న మంజులా ఎలాగైనా ఆ బాలుడిని అంతం చేయాలని నిర్ణయించుకుంది.

రెండుమూడు సార్లు విఫలమై..

ఎలాగైనా ఆ బాలుడిని అంతం చేయాలని లోలోపల రగిలిపోతున్న మంజుల ఇటీవల ఇంట్లో చిన్నారి నోరు, ముక్కు మూసి చేతులు పట్టుకుంది. బాలుడి తల్లి గమనించి ప్రశ్నించడంతో తాము ఆడుకుంటున్నామని చెప్పి తప్పించుకుంది. ఆ తర్వాత ఇంటి పై అంతస్తుకు తీసుకెళ్లిరెయిలింగ్ పై కూర్చొబెట్టింది. ఇది గమనించిన తాత ఆమెను మందలించాడు. ఇదిలా జరుగుతున్న క్రమంలోనే ఈ నెల 9వ తేదీన ఆ బాలుడిని కిచెన్ లోతి కీసుకువెళ్లి తాను జ్యూస్ తాగితే టాక్లెట్ ఇస్తానని ఆశచూపి జ్యూస్ కు బదులు ఆ చిన్నారి చేత యాసిడ్ తాగించింది. కొద్దిసేపటికే బాలుడు తీవ్ర అస్వస్థతకు గురవడంతో విషయం గమనించిన తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై బాలుడి తల్లి మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story