19 చిన్న తరహా ఖనిజ బ్లాకుల వేలం విజయవంతం

by Muthe.Rajitha |

19 చిన్న తరహా ఖనిజ బ్లాకుల వేలం విజయవంతం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఈనెల 23 నుంచి 27వరకు జరిగిన చిన్న తరహా ఖనిజ బ్లాకుల వేలం మొదటి దశ విజయవంతంగా పూర్తి అయింది. 10 సంవత్సరాల తరువాత సహాజ వనరుల పారదర్శకత, న్యాయోచిత, సమర్థవంతమైన కేటాయింపులు నిర్దారించడానికి ప్రదాన ఖనిజాల కోసం వేలం ఆదారిత కేటాయింపు జరిగింది. సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాల మేరకు త్వరతగతిని, పారదర్శకంగా గనులు భూగర్భశాఖ 19 బ్లాకుల వేలం నిర్వహించింది. కలర్​గ్రానైట్​ఒక బ్లాకు 3.63 హెక్టార్లు, లాటరైట్ 4 బ్లాకులు​15.834 హెక్టార్లు, స్టోన్​, మెటల్ 14 బ్లాక్​లు, ​47.125 హెక్టార్లు, బిడ్​ప్రీమియం రూ. 56.74 కోట్ల ఉంది.

వేలం ప్రారంభానికి ముందు సాంకేతిక మూల్యాంకన కమిటీ, లావాదేవీల సలహాదారు నియామకం, ఈ వేలం పోర్టల్​ప్రొవైడర్​ఎంపిక, టెండర్, ఈఎండీ చెల్లింపుల డిజిటలైజేషన్, ప్రీ ఎంబెడెడ్​బ్లాక్స్​విధానం రూపొందించారు. మొదటి విడుత వేలం విజయవంతం కావడంతో ఇక నుంచి ప్రతినెలా విడుతల వారీగా వేలం నిర్వహించాలని గనుల శాఖ యోచిస్తోంది.

Next Story