- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు పెట్టాలి : బండి సంజయ్
ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో గులాబీ నేతల నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికరం అన్నారు. క్షతగాత్రులందరికీ తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని ఈ సందర్భంగా బండి సంజయ్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన, అన్ని రకాల సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో గులాబీ నేతల నిర్లక్ష్యం కారణంగా బాణాసంచా నిప్పు రవ్వలు ఓ గుడిసెపై పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికరం. క్షతగాత్రులందరికీ తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలి. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సాయం అందించాలి. ఈ…
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 12, 2023






