- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Chilukuru Balaji : చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడిపై దాడి..ఫిర్యాదు

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతినొందిన చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకుడు రంగరాజన్ పై దాడి ఘటన కలకలం రేపింది. టెంపుల్ ప్రస్తుత ప్రధాన అర్చకుడు, తన కుమారుడు రంగరాజన్ పై జరిగిన విచక్షణారహిత దాడిని ప్రొటెక్షన్ మూమెంట్ ఫౌండర్, చిలుకూరు బాలాజీ ప్రధానార్చకులు సౌందర్య రాజన్ తీవ్రంగా ఖండించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ సమీపంలోని అర్చకుల ఇంట్లో చొరబడి రంగరాజన్ పై దాడి చేసి గాయపరిచిన ఘటనపై పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ రిలీజ్ విడుదల చేశారు. రెండురోజుల క్రితం జరిగిన ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించారు. ప్రస్తుతం రంగరాజన్ బాగానే ఉన్నారని...ఆలయ విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.
రంగరాజన్‌పై దాడికి పాల్పడ్డ వారు రామ రాజ్యం సంస్ధకు చెందినవారని.. ఆలయ బాధ్యతలు అప్పగించి.. తమ సంస్థలో చేరాలని రంజరాజన్‌ను బెదిరించారని సమాచారం. అయితే కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రెండు రోజుల పాటు ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ టీీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు కేసును చేధించే పనిలో ఉన్నారు. ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్టు చేశారు.
కాగా చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు రంగరాజన్ పై దాడి ఘటనను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎందరికో ధర్మ మార్గం చూపించి, హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న శ్రీ చిలుకూరు బాలాజీ ప్రదాన అర్చకులు రంగరాజన్ పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.