- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ అభ్యర్థిపై దాడి.. కళ్లలో కారం కొట్టి.. ఆపై క్రూరంగా..
సర్పంచ్ అభ్యర్థిపై దాడి.. కళ్లలో కారం కొట్టి.. ఆపై క్రూరంగా..

దిశ, వెబ్‌డెస్క్/శంకరపట్నం: కరీంనగర్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి దండు కొమురయ్య(Attack on Sarpanch Candidate)పై శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. శంకరపట్నం మండలం మొలంగూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి చేయడానికి వచ్చిన వారిని గుర్తుపట్టకుండా ముందుగా కొమురయ్య కళ్లలో కారం పొడి చల్లి దాడికి తెగబడ్డారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించి వస్తుండగా.. అటాక్ చేశారు. కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడిన వారు ఎవరు? ఎందుకు దాడి చేశారు? అనే నేపథ్యంలో ఆరా తీస్తున్నారు.
మరోవైపు.. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫేజ్-II సమయంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కోసం సెక్షన్ 163 BNSS ఉందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ శనివారం తెలిపారు. జిల్లాలో ఎక్కడా 5 మంది.. అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడకూడదని, సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే చట్టబద్ధమైన సమావేశాన్ని నిర్వహించాలన్నారు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.






