5 pm Dynamic: గలీజ్‌గా ప్రవర్తించిన యువకులు.. వద్దన్నదని లేడీ ఎస్ఐని పొట్టుపొట్టుగా కొట్టి..

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-03-13 14:00:18  IST  )

పోలీస్ అయితేనేం.. ఆమె ఆడది అనుకున్నారేమో.. లేదా మత్తులో ఉన్నారో.. మదమెక్కి ఉన్నారో కానీ యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అడ్డుకోవమే ఆమె తప్పైంది.

5 pm Dynamic: గలీజ్‌గా ప్రవర్తించిన యువకులు.. వద్దన్నదని లేడీ ఎస్ఐని పొట్టుపొట్టుగా కొట్టి..
X

పోలీస్ అయితేనేం.. ఆమె ఆడది అనుకున్నారేమో.. లేదా మత్తులో ఉన్నారో.. మదమెక్కి ఉన్నారో కానీ యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అడ్డుకోవమే ఆమె తప్పైంది. మమ్ముల్నే అడ్డుకుంటావా అంటూ లేడీ ఎస్ఐ జుట్టుపట్టుకోని దాడి చేశారు. అచేతనస్థితిలో ఎస్ఐ పరుగులు తీసినా వెంటాడి కొట్టారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎమ్మెల్సీలను ఎన్నుకున్నారు. ఏపీలో ఐదుగురు, తెలంగాణలోనూ ఐదుగురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. కొత్తగా శాసన మండలిలోకి అడుగుపెట్టబోతున్న ఆ ఎమ్మెల్సీల లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హోళీ పండుగకు ముందే రాష్ట్రంలో దావత్ షురూ అయింది. ఇదేదో బచ్చకాలి పిల్లగాళ్లు చేసుకోవడం లేదు. సాక్షాత్తు మన తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు జిల్లాల్లో గంప గుత్తగా చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరూ ప్రజాప్రతినిధులు ఈ దావత్‌లో ముక్క కొరుకుతున్నారు. ఈ విందుల్లో పార్టీ కార్యచరణ, ఓటములు, రాబోయ్యే ఎన్నికల్లో గెలుపునకు వ్యూహం రచించేందుకు జిల్లాల వారిగా స్కెచ్‌లు గీసుకుంటున్నారట. మరి ఎక్కడెక్కడ ఎవరు దావత్ చేస్తున్నారంటే..

నోటి దురుసు తగ్గించుకుంటే మంచిది... ఈ మాట పెద్దలు అనేక సందర్భాలలో గుర్తు చేస్తుంటారు. అలాంటిది రాష్ట్ర శాసన సభలో ఎంత హూందాగా మాట్లాడాలి. కానీ ఓ ప్రతిపక్ష నేత తన నోటి దురుసును ప్రదర్శించారు. ఏకంగా స్పీకర్‌నే టార్గెట్ చేశారు. ఫలితం అనుభవించారు. శాసనసభ నుంచి గెట్ అవుట్ అనిపించుకున్నారు. ఇంతకూ ఆ నోటి జిల ప్రదర్శించిన ఎమ్మెల్యే గారు ఎవరో తెలుసా..?

సింగిల్ నైట్‌లో ఫేమ్ కావాలని నేటి యువత ఆరాటపడుతుంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకోని విన్యాసాలు మొదలు పెడుతుంది. ఇంకేం.. ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అవుతున్నారు. ఇక సెలబ్రిటీ హోదా వచ్చాక ఆగుతారా.. డబ్బుల కోసం ఎలాంటి అడ్డమైన వీడియోలు, ప్రమోషన్స్ అయినా చేస్తారు. యువతను చెడుమార్గంలోకి నెట్టే దుర్మార్గపు పనులూ చూస్తారు. ఇలా చేసే తెలంగాణకు చెందిన యూట్యూబర్లు అడ్డంగా బుక్కయ్యారు. పోలీసులు సైతం వాళ్లను బొక్కలో వేయడానికి సిద్ధమయ్యారు. మరి శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్లే యూట్యూబర్స్ ఎవరో చూద్దామా..

Next Story