దారుణం.. నలుగురు విద్యార్థులకు గుండు గీయించిన కాలేజీ యాజమాన్యం

by Sathputhe Rajesh |   (  Updated:2023-11-29 03:27:27  IST  )

నలుగురు విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం గుండు గీయించడం కలకలం రేపింది.

దారుణం.. నలుగురు విద్యార్థులకు గుండు గీయించిన కాలేజీ యాజమాన్యం
X

దిశ, వెబ్‌డెస్క్: నలుగురు విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం గుండు గీయించడం కలకలం రేపింది. ఈ ఘటన ఏపీ నంద్యాల నలంద కాలేజీలో చోటు చేసుకుంది. నలంద కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మెస్ లో జూనియర్, సీనియర్ విద్యార్థులు తన్నుకున్నారు. విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం కౌన్సెలింగ్ ఇచ్చింది. హెయిల్ స్టైల్ వింతగా ఉందని.. నలుగురు విద్యార్థులకు యాజమాన్యం గుండు గీయించింది. కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story